కోలీవుడ్ స్టార్ హీరో కమ్ పొలిటిషన్ విజయ్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. తన అభ్యర్థులను నిలపడమే కాదు వాళ్ళ గెలుపు కోసం విజయ్ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జన నాయగన్ విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం కుట్ర చేసింది అని ఆరోపించిన విజయ్ నేడు మరిన్ని హాట్ కామెంట్స్ చేసారు.
30 ఏళ్లుగా నా చుట్టూ ఉన్నవారు నన్ను మోసం చేసారు, సరిగ్గా ఎన్నికలకు 30 రోజుల ముందు నన్ను అపఖ్యాతి పాలు చేయాలని చూస్తున్నారు. కానీ, మీరు ఎన్ని కష్టాలు పెట్టినా ప్రజల నుంచి నన్ను వేరు చేయలేరు అని ఆయన ఎన్నికల ప్రచారంలో ఎమోషనల్ గా కామెంట్స్ చేసారు.
అయితే విజయ్ ఇదంతా భార్య సంగీత తో తను ఎదుర్కున్న ఇబ్బందులు, ఆమె కొద్దిరోజుల క్రితమే విడాకుల విషయంగా కోర్టుకు వెళ్లి తన పరువుని బజారున పడేసింది అనే అక్కసుతోనే విజయ్ ఈ తరహా కామెంట్స్ చేసారని అందరూ భావిస్తున్నారు.