Advertisement
Google Ads BL

సోదరుడి భార్య పై హీరోయిన్ పరువు నష్టం కేసు


హీరోయిన్ హన్సిక మోత్వానీ తన భర్త సోహైల్ కతూరియా తో విడిపోయిన విషయం తెలిసిందే. తన భర్త తో వచ్చిన మనస్పర్థల కారణంగానే హన్సిక సోహైల్తో విడిపోయింది. కొన్నాళ్ల క్రితం హన్సిక పై తన సోదరుడు భార్య, టీవీ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్‌ గృహ హింస కేసు పెట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో హన్సిక సోదరుడు, ఆమె తల్లితండ్రులు, అలాగే హన్సికపై ఈ కేసు నమోదు అయ్యింది.

Advertisement
CJ Advs

తాజాగా హన్సిక తన సోదరుడి భార్య పై పరువు నష్టం కేసు వేసింది. తనపై, తన సోదరుడు ప్రశాంత్ మోత్వానిపై ముస్కాన్ గృహ హింస ఆరోపణలు చేయడంతో తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆరోపిస్తూ హన్సిక ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించాడం హాట్ టాపిక్ అయ్యింది.

ముస్కాన్ పెళ్లి సమయంలో తన పేరెంట్స్ నుంచి హన్సిక ఇంకా ఆమె పేరెంట్స్ ఖరీదైన బహుమతులను అడిగారని, పెళ్లి తర్వాత తనని వేధించారంరంటూ తన భర్త ప్రశాంత్‌తో పాటు హన్సికపై కూడా ముస్కాన్ వేధింపులు, గృహ హింస ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

దానితో ఈ ఆరోపణలను ఖండిస్తూ హన్సిక  గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా హన్సిక.. ముస్కాన్ పై పరువునష్టం కేసు వేసింది. ఈ ఆరోపణల వల్ల తన ప్రతిష్టకు భంగం కలిగింది అని, ముస్కాన్ తనకు  బహిరంగ క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఆమెను నిలువరించాలని కోర్టును కోరింది. 

Hansika Sues Estranged Sister In Law:

Hansika Motwani has filed a defamation suit against her sister-in-law
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs