హైదరాబాద్ మహానగరానికే హైకానిక్ గా నిలిచేలా అల్లు అరవింద్ కోకాపేట అల్లు స్టూడియోస్ లో నిర్మించిన అల్లు సినిమాస్ డాల్బీ ఎక్స్పీరియన్స్ కోసం ఆడియన్స్ క్యూ కడుతున్నారు. రీసెంట్ గా ఓపెన్ అయిన అల్లు సినిమాస్ లో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులే కాదు సినిమా సెలబ్రిటీస్ కూడా ఇంట్రెస్ట్ చూపించడం హాట్ టాపిక్ గా మారింది. జర్నలిస్ట్ లకు ప్రెస్ షోస్ దగ్గర నుంచి సినిమా ఈవెంట్స్ వరకు అల్లు సినిమాస్ ఫేమస్ అయ్యింది.
ఇక అల్లు సినిమాస్ లో ధురంధర్ ద రివెంజ్ ఒకటి కాదు మూడుసార్లు చూశామని, కానీ ఎక్కడా బోర్ కొట్టలేదు అంటూ ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. అదే అల్లు సినిమాస్ లో గత రాత్రి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ధురంధర్ 2 ద రివెంజ్ వీక్షించడం హైలెట్ అయ్యింది.
ప్రభాస్, సందీప్ వంగ దురంధర్ 2 ని అల్లు సినిమాస్ లో వీక్షిస్తున్నారని తెలిసిన ఫ్యాన్స్ ప్రభాస్ ని చూసేందుకు తెల్లవారు ఝాము మూడు గంటల వరకు అల్లు సినిమాస్ గేట్ల దగ్గర వెయిట్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.