Advertisement
Google Ads BL

HYD వ‌దిలి రాలేక‌పోతున్న టాలీవుడ్


ప్ర‌స్తుతం ఏపీ టాలీవుడ్ స్థ‌బ్ధుగా ఉంది. ఏటూ క‌ద‌ల్లేని స్థితిలో ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఒక ఎఫ్‌డిసి ఉన్నా కానీ నామ‌మాత్రంగా మాత్ర‌మే అది కొన‌సాగుతోంది. ఏపీకి టాలీవుడ్ త‌ర‌లి రాలేదు గ‌నుక అక్క‌డ వినోదం ఎప్ప‌టికి `గుండు సున్నా`గా మిగిలిపోవాల్సిందే. అంతేకాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ప్ర‌తియేటా ద‌క్కాల్సిన 4000 కోట్ల‌ వినోదపు ప‌న్ను కూడా అట‌కెక్కింది.

Advertisement
CJ Advs

ప్ర‌భుత్వం వైపు నుంచి క‌ద‌లిక వ‌స్తున్నా సినీపెద్ద‌ల‌కే ఆస‌క్తి ఉన్న‌ట్టు లేదు. ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న చేసాక సినీపెద్ద‌లు తూతూ మంత్రంగా స్పందించ‌డం చూస్తుంటే, అంత‌గా ఆస‌క్తి లేదేమో అనే సందేహాలు వ‌స్తున్నాయ‌ని ఆంధ్రప్ర‌దేశ్ ఫిలిండెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ పెద్ద‌ల్లో ఒక‌రు వ్యాఖ్యానించారంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.

అయినా ప్ర‌భుత్వం రాయితీతో భూములిచ్చేదెపుడు?  స్టూడియోలు క‌ట్టేదెప్పుడు? అందుబాటులోకి వ‌చ్చేదెపుడు?

ఏటేటా వేల‌ కోట్ల ఆదాయం ద‌క్కేదెప్పుడు? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ప‌న్ను ఆదాయం ఏపీ న‌ష్ట‌పోతోంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అన్న‌ట్టు ఎంపీ కేశినేని చిన్ని ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. తెలుగు చిత్ర‌సీమ త‌ర‌లి వ‌చ్చేదెప్పుడు?  ఏపీకి ఆదాయం తెచ్చేదెప్పుడు అనేది పైవాడే డిసైడ్ చేయాలేమో!  ఏపీ ప్ర‌భుత్వం నంది అవార్డులు ఇచ్చేందుకు ఆస‌క్తిగా ఉన్నా ఇప్పుడు సినీ ప‌రిశ్ర‌మ‌లోనే పెద్ద‌గా క‌ద‌లిక లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

The film industry is unable to leave HYD!:

The film industry is unable to leave Hyderabad
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs