Advertisement
Google Ads BL

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్


మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ చేసారు. 2019 లో ఆ పాదయాత్ర తోనే అధికారం చేపట్టి బటన్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి 2024 అధికారం కోల్పోవడమే కాదు ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. పార్టీ ఓడిపోయాక తాడేపల్లి నుంచి బెంగుళూరు ప్యాలెస్, బెంగుళూరు నుంచి తాడేపల్లి అంటూ అప్ డౌన్ చేస్తున్న తాజాగా జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Advertisement
CJ Advs

దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే నినాదంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఎర వేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఫెయిల్ అయ్యి చెత్తబుట్టలోకి వెళ్లాయి. వచ్చే ఏడాది తాను పాదయాత్ర ప్రారంభిస్తానని, పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపిస్తామని జగన్ హెచ్చరించారు. 

తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పుల్లో మెజారిటీ వాటా (రూ. 2.73 లక్షల కోట్లు) నేరుగా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి చేరిందని తెలిపారు. చంద్రబాబు ఈ రెండేళ్లలోనే రూ. 3.52 లక్షల కోట్ల అప్పు చేశారని, ఈ నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయని జగన్ ప్రశ్నించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూటమి ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు. 

గత ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రగతిని తిరోగమనంలోకి నెట్టారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రతో రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు.

Jagan Mohan Reddy:

Jagan Mohan Reddy - Padayatra
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs