Advertisement
Google Ads BL

ప్యారడైజ్ పై ఈ రూమర్స్ఏల


నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఫిలిం ద ప్యారడైజ్ చిత్రం పై భీభత్సమైన అంచనాలున్నాయి. నాని లుక్ దగ్గర నుంచి ఆయా షేర్ సాంగ్ వరకు అన్ని ప్యారడైజ్ పై అంచనాలు పెంచేసాయి. రామ్ చరణ్ పెద్ది తో పోటీపడిన ప్యారడైజ్ ఆతర్వాత పెద్ది కోసము, ధురంధర్ 2 కోసం పోస్ట్ పోన్ అయ్యి ఆగష్టు కి వెళ్ళిపోయింది.

Advertisement
CJ Advs

శ్రీకాంత్ ఓదెల కూల్ గా షూటింగ్ పూర్తి చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. ఇంకా నాలుగు నెలలు సమయం ఉండడంతో యూనిట్ మొత్తం ఛిల్ అవుతూ ప్యారడైజ్ ని పాన్ ఇండియా కోసం సిద్ధం చేస్తుంటే.. మరోపక్క ప్యారడైజ్ ని మళ్లీ పోస్ట్ పోన్ చెయ్యబోతున్నారు అనే వార్తలను సోషల్ మీడియాలో కొంతమంది కావాలని హైలెట్ చేస్తున్నారు.

క్వాలిటీ కోసము, అలాగే ఇతరత్రా కారణాలతో నాని ప్యారడైజ్ ని ఆగష్టు నుంచి వాయిదా వేసి డిసెంబర్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ఆలోచన చేస్తున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు. కానీ ద ప్యారడైజ్ ఆగష్టు లో రావడం పక్కా.. విడుదల తేదీలో ఎలాంటి మార్పులేదు అని సన్నిహిత వర్గాల సమాచారం. సో నాని ఫ్యాన్స్ అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. 

The Paradise Update:

The Paradise Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs