ఏప్రిల్ 8 అంటే అల్లు అభిమానులకు పండుగ రోజు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. ఏప్రిల్ 8 కోసం ఏడాది పొడుగునా వెయిట్ చేస్తారు ఫ్యాన్స్. పుష్ప 1, పుష్ప 2 చిత్రాలతో పాన్ ఇండియా మార్కెట్ లో బలమైన ముద్ర వేసిన అల్లు అర్జున్. తన తదుపరి మూవీ ని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో AA22xA6 వర్కింగ్ టైటిల్ తో స్టార్ట్ చేసి ఏడాది కావొస్తుంది.
అందుకే AA 22 అప్ డేట్ కోసం ఏప్రిల్ 8 కోసం అల్లు అభిమానులు చాలా వెయిట్ చేసారు. AA22xA6 ని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ గా ఏం పెట్టబోతున్నారో అనే క్యూరియాసిటీకి అల్లు అర్జున్ బర్త్ డే రోజున తెర తీశారు. AA22xA6 కి పవర్ ఫుల్ టైటిల్ రాకా అంటూ అల్లు అర్జున్ మాసివ్ లుక్ తో రివీల్ చేసారు.
ఏడాది కాలంగా సైలెంట్ గా షూటింగ్ చేస్తున్న అట్లీ.. అల్లు అర్జున్ ని రాకా #Raaka గా ఇంట్రడ్యూస్ చేసి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ చిత్రాన్ని ఏకంగా ఏడు పాన్ ఇండియా భాషల్లో విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. #రాకా | #राका | #ರಾಕಾ | #ராக்கா | #രാക്ക | #রাকা | راکا భాషల్లో రాక రిలీజ్ కానుంది.
ఈచిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొనె నటిస్తుండగా.. మరో నలుగురు హీరోయిన్స్ అల్లు అర్జున్ సరసన కనిపించనున్నారు.