బాలీవుడ్ లో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2 సంచలనాలకు నెలవుగా మారింది. రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ఈచిత్రం ఇంకా ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెడుతుంది. రణ్వీర్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచిన ధురంధర్ ద రివెంజ్ పై రణ్వీర్ భార్య టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
భర్త రణ్వీర్ తో దీపికా కు విభేదాలొచ్చాయి అందుకే ధురంధర్ 2 పై స్పందించలేదు అంటూ ప్రచారం జరిగింది. ఆతర్వాత రణ్వీర్-దీపికా ఓ రెస్టారెంట్ లో కలిసి సెల్ఫీ లతో సందడి కూడా చేశారు. తాజాగా దీపికా పదుకొనె తను దురంధర్ 2 ఎందుకు చూడలేదు, సోషల్ మీడియాలో ఎందుకు స్పందించలేదు అనే ట్రోల్స్ కి గట్టిగ కౌంటర్ వేసింది.
మీ అందరికంటే ముందే నేను ధురంధర్ 2 సినిమాను చూశాను. ఈ విషయం మీకు తెలీదు. ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరిని విమర్శించాలి అంటూ ట్వీట్ చేసిన దీపికా ఈ పోస్ట్ తో.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టనంత మాత్రాన తమ ఇద్దరి మధ్యన సంబంధాలు సరిగ్గా లేవని కాదు అనేది స్పష్టతనినిచ్చింది.