యంగ్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ మూవీ షూటింగ్ విషయాలు ఏవి నిర్మాతలు అఫీషియల్ గా చెప్పకపోవడంతో #NTRNeel మూవీ పై రకరకాల వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా కూడా ఎన్టీఆర్ లుక్ విషయంగా #NTRNeel ప్రాజెక్ట్ షూటింగ్ ని ఆపేశారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోపక్క #NTRNeel మూవీ నుంచి మలయాళ స్టార్ తోవినో థామస్ తప్పుకోవడం అన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చెయ్యడం, తాజా రూమర్స్ వాళ్ళను మరింతగా టెన్షన్ పెడుతుండడంతో #NTRNeel మేకర్స్ వెంటనే పరిస్థితిని అర్ధం చేసుకుని ఓ ట్వీట్ చేసారు.
There is absolutely no truth to the rumours circulating about the look or any schedule cancellation. The film is progressing as planned, with only a routine preparation gap. We request everyone not to believe or spread unverified information. Official updates will always come from us.
#NTRNeel
ఎన్టీఆర్ లుక్ గురించి గానీ, #NTRNeel షెడ్యూల్ రద్దు గురించి గానీ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రూమర్స్ లో ఏమాత్రం నిజం లేదు. షెడ్యూల్ షెడ్యూల్ కి ఆమద్యన బ్రేక్ తప్ప, సినిమా ప్లానింగ్ చేసిన ప్రకారమే ముందుకు సాగుతోంది. నిజం లేని వార్తలను నమ్మవద్దని, వాటిని వైరల్ చేయవద్దని మేము అందరినీ కోరుతున్నాము. అధికారిక అప్‌డేట్‌లు ఎప్పుడు మా నుండే వస్తాయి.. అంటూ ట్వీట్ చేసారు.