అక్కినేని హీరో సుమంత్ సీతారామం బ్యూటీ ప్రస్తుతం డెకాయిట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ని క్షమాపణ అడగడం హాట్ టాపిక్ అయ్యింది. అది ఎందుకు ఏమిటి అంటే.. సుమంత్ ఈరోజు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో జరుగుతున్న డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాగా.. ఆయన స్టేజ్ పై మృణాల్ కు సభా ముఖంగా క్షమాపణ చెబుతున్నట్టుగా ఆమెను సారీ అడిగారు.
ఎందుకు అంటే సీతారామం లో నీ రామ్ ని నీ దగ్గర్నుంచి తీసుకెళ్లిపోయినందుకు.. సభాపూర్వకంగా క్షమించమని అడుగుతున్నాను, అసలు సీతారామం లో ఆ సీన్ ఉంది, కానీ ఎడిటింగ్ లో పోవడం వల్ల నేను ఇప్పుడు ఇక్కడ నిన్ను క్షమించమని అడుగుతున్నాను అంటూ సుమంత్ మృణాల్ కి సారీ చెప్పాడు.