మెగా పపవర్ రామ్ చరణ్ - బుచ్చి బాబు కలయికలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న పెద్ది చిత్రం ఏప్రిల్ 30 నుంచి పోస్ట్ పోన్ చెయ్యడమే కాదు ఇప్పుడు రెండు కొత్త తేదీలపై కన్నేసినట్లుగా తెలుస్తుంది. జూన్ 4 కానీ, లేదంటే జూన్ 25 కానీ ఏదో ఒక డేట్ ని లాక్ చెయ్యడానికి మేకర్స్ ఓటీటీ సంస్థతో చర్చిస్తున్నారట.
ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ పెద్ది డిజిటల్ రైట్స్ ని రూ.130 కోట్లకు కొనుగోలు చేసిందట. ఏప్రిల్ 30 రిలీజ్ అన్నప్పుడు ఆ డీల్ ఉన్నా, పోస్ట్ పోన్ అంటే గనక సదరు ఓటీటీ సంస్థ ఆ డీల్ లో ఎంతో కొంత కోత విధించే ఛాన్స్ లేకపోలేదు అని, ఒకవేళ ఏ డేట్ కి రిలీజ్ అయినా సినిమా బ్లాక్ బస్టర్ అయితే గనక రూ.20 కోట్లు బోనస్ ఉంటుంది అనే టాక్ ఉంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడమే మూవీ ఆలస్యానికి కారణం అనే టాక్ వినపడుతుంది. మరి పెద్ది పోస్ట్ పోన్ అనే విషయాన్ని మేకర్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని మెగా ఫ్యాన్స్ కన్నా ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ ఎదురు చూస్తుంది.