పెద్ది చిత్రం ఏప్రిల్ 30 నుంచి పోస్ట్ పోన్ పక్కాగా కనిపిస్తుంది. ఇప్పటివరకు సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడము, చాలా సినిమాలు ఏప్రిల్ 30, మే 1 కి కచ్చిఫ్ లు వేస్తూ రిలీజ్ తేదీలను ప్రకటించడం చూస్తుంటే.. పెద్ది రాక ఆలస్యమని అర్ధమైపోతుంది. పెద్ది స్పెషల్ సాంగ్ చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు.
ఏప్రిల్ 9 నుంచి పెద్ది స్పెషల్ సాంగ్ చిత్రీకరణ చేపడతారట బుచ్చిబాబు. రీసెంట్ గా రామ్ చరణ్ కి పెద్ది సెట్ లో దెబ్బ తగలడం, అయినా షూటింగ్ చేస్తున్నా పెద్ది పనులు కొలిక్కి రాకపోవడంతో పెద్ది వాయిదా తధ్యమని తెలుస్తుంది. సో ప్రచారం జరుగుతున్నట్టుగానే పెద్ది జూన్ 25 కి విడుదల చేస్తారని సమాచారం.
పెద్ది రిలీజ్ జూన్ 25 కి ఉంటుంది ఇక ఫిక్స్ అయిపోండి అంటూ మెగా ఫ్యాన్స్ ని చల్లబరుస్తున్నారు. మేకర్స్ ఈ రోజో, రేపో పెద్ది వాయిదా విషయాన్ని తెలుపుతూ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తుంది.