నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీ కి పరిచయమయ్యే రోజు కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తుంటే.. సోషల్ మీడియాలో నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఇంట్రడక్షన్ పై ట్రోల్స్ మొదలయ్యాయి. మోక్షజ్ఞ మొదటి సినిమాని గ్రాండ్ గా అనౌన్స్ చేసి సైలెంట్ అయ్యి ఏడాదిన్నర పైనే అయ్యింది.
కానీ ఆ సినిమా విషయంలో స్పష్టత రాక అభిమానులు నలిగిపోతుంటే మోక్షజ్ఞ సినీ అరంగేట్రం పై ట్రోల్స్ మొదలయ్యాయి. బాలయ్య సినిమాల మీద సినిమాలు, డైరెక్టర్స్ మీద డైరెక్టర్స్ ని లైన్ లో పెడుతున్నారు, కానీ కొడుకు కోసం బాలయ్య ప్లానింగ్ ఏమైంది అంటూ మాట్లాడుతున్నారు.
కొడుకు మోక్షుజ్ఞ ని ఇంట్రడ్యూస్ చేసేందుకు బాలయ్య ఎందుకింత ఆలోచిస్తున్నారు.. ఇంకా ఎన్నాళ్లీ ఎదురు చూపులు అని అభిమానులు మొత్తుకుంటున్నారు. ఆదిత్య 999 మ్యాక్స్ తోనే మోక్షజ్ఞ నటుడిగా పరిచయం కానున్నాడని చెబుతున్నారు తప్ప ఆ ప్రాజెక్ట్ మొదలయ్యేది ఎప్పుడో చెప్పకుండా సహనానికి పరీక్ష పెడుతున్నారు అంటూ అభిమానుల్లోనూ అసహనం మొదలైంది.