Advertisement
Google Ads BL

మట్టిలో క‌లిసిపోతున్న‌ కపూర్ల వారసత్వం!


భారతీయ సినీ దిగ్గజం రాజ్ కపూర్ పూర్వీకుల నివాసం పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉన్న చారిత్రాత్మక కపూర్ హవేలీ ప్రకృతి వైపరీత్యాలకు విలవిలలాడుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఐదు అంతస్తుల భవనంలోని ప్రధాన భాగం నేలమట్టమవ్వడం సినీ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 1918-1922 మధ్య నిర్మితమైన ఈ కట్టడం కేవలం ఇటుకల గోడ మాత్రమే కాదు. పృథ్వీరాజ్ కపూర్ పుట్టిన గడ్డగా శతాబ్ద కాలపు భారతీయ సినిమా మూలాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.

Advertisement
CJ Advs

విభజన అనంతరం పాకిస్థాన్ ప్రభుత్వం దీనిని హెరిటేజ్ సైట్‌గా ప్రకటించినప్పటికీ సరైన సంరక్షణ చర్యలు లేకపోవడంతో  వారసత్వ సంపద శిథిలావస్థకు చేరుకుంది. భవన యజమానులకు, పురావస్తు శాఖకు మధ్య ఉన్న న్యాయపరమైన చిక్కులు, నిధుల కొరత కారణంగా  హవేలీ గాలికి వదిలేసినట్లయింది. గతంలో రిషి కపూర్, రణబీర్ కపూర్ పూర్వీకుల ఇంటిని చూడాలని ఆశపడినప్పటికీ రాజకీయ పరిస్థితుల వల్ల అది సాధ్యపడలేదు. ఇప్పుడు కళ్లముందే ఈ స్మృతి చిహ్నం మట్టిలో కలిసిపోతుండటం కపూర్ ఖాందాన్ సభ్యులను కలిచివేస్తోంది.

కళకు సరిహద్దులు లేవని చాటిన ఇటువంటి కట్టడాలు కూలిపోవడం సినిమా చరిత్రలో సువర్ణ అధ్యాయం ముగిసిపోవడమే. ఇదే ప్రాంతంలో ఉన్న దిలీప్ కుమార్ నివాసం కూడా దాదాపు ఇలాంటి దుస్థితిలోనే ఉండటం గమనార్హం. అంతర్జాతీయ వారసత్వ సంస్థలు , స్థానిక ప్రభుత్వాలు వెంటనే స్పందించి మిగిలి ఉన్న కపూర్ హవేలీ భాగాలనైనా పునరుద్ధరించాలని కళాభిమానులు కోరుతున్నారు. లేనిపక్షంలో మహానటుల ఆనవాళ్లు కేవలం పాత ఫోటోలకే పరిమితమైపోయే ప్రమాదం ఉంది.

Raj Kapoor ancestral Haveli in Pakistan Peshawar partially collapses after rains:

Portion of Raj Kapoor historic Kapoor Haveli in Peshawar collapses after heavy rains
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs