హీరో శర్వానంద్ బైకర్ తో మంచి హిట్ కొట్టాడు. గత మూడు రోజులుగా బైకర్ చిత్ర థియేటర్స్ అన్ని ఆడియన్స్ తో కళకళలాడాయి. నారి నారు నడుమ మురారి, బైకర్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో శర్వానంద్ బాగా ఎగ్జైట్ అవుతున్నాడు. అందుకే బైకర్ సినిమా సక్సెస్ మీట్ కోసం వెళ్లి ఏదేదో మాట్లాడడం సోషల్ మీడియాలో శర్వా ను ట్రోల్ అయ్యేలా చేసాయి.
హీరో శర్వ కి ఏమైంది ???
శర్వానంద్ వాలకం మునపటిలా లేదు.
సూపర్ డూపర్ హిట్లు వచ్చిన రోజుల్లో కూడా ఇలా వ్యవహరించలేదు.
గడిచిన 6 నెలలుగా ఇంటర్వ్యూ చూసిన సక్సెస్ మీట్ చూసిన ఎవరిపైనో తన సక్సెస్ ద్వారా. ప్రతీకారం తీర్చికుంటున్నట్టు మాట్లాడడం.
సగం హైదరాబాద్ లో, చెన్నై లో ఒక అగ్ర హీరో ఆస్తుల అన్నిటికీ తన తాత, తండ్రి బాధ్యత. మరో ఇండస్ట్రీ పెద్ద కుమారుడికి క్లోస్ ఫ్రెండ్ అలాంటి కుటుంబం నుండి వచ్చి షర్ట్ కొనుక్కోవడానికి ఏడ్చేశాను. డబ్బులు లేవు నన్ను తొక్కలేరు నేను లేస్తా. ఇంకోసారి మోసపోను అని ఇలాంటి వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఏమిటి ?
గత కొన్ని నెలలుగా ఆయన బరువు తగ్గడం, ఒకటి దానితో పాటు ఆయన మాట స్వరం కూడా తగ్గిపోయింది.
నిజం చెప్పాలంటే శర్వా మాట్లాడితే అపద్బాంధవుడు సినిమా క్లైమాక్స్ లో చిరంజీవి గారికి షాక్ తగిలి సగం సగం నత్తిగా మాట్లాడినట్టు ఉంది ఈ మధ్య. కారణం ఏందో అర్థం కావడం లేదు.. అని ఒకరు ట్వీట్ చేస్తే...
ఒకప్పుడు @ImSharwanand వేరు,
ఇప్పుడు మనం చూస్తున్నా శర్వ వేరు.
అప్పుడే నచ్చే వాడు అందరికి.
మరీ ఇప్పుడు ఎవరు డైరెక్టర్ చేస్తున్నారో ఏమో ఇలా మాట్లాడమని. వేరే హీరోలు గట్టిగా మాట్లాడడం వల్ల క్రేజ్ వచ్చిందితేం అని మనం కూడా అలాగే గట్టిగా మాట్లాడితే కుదరదు. PR Team కొంచం చూసుకోవాలి. మీ హీరో పైన opinion తీసుకోండి జనాల దగ్గర. అందరూ అరుస్తున్నారు నేను కూడా హిట్ కొట్టిన గట్టిగా మాట్లాడితే సినిమాని అందరూ చూస్తారు అని అనుకోవడం తప్పు. సినిమా హిట్ అయినప్పుడు మనం గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. జనాలే చెప్తారు గట్టిగా అందరికి.
Theatre వేరు, Temple వేరు.
గుడికి వెళ్ళొచ్చిన భక్తుడిలో ప్రతిసారి మొఖంలో వెలుగుంటుంది,
కానీ థియేటర్ నుండి వచ్చే ప్రతి ప్రేక్షకుడిలో వెలుగుంటుందా ?
గుడికి వెళ్ళే వాడి మనసులో భక్తి ఉంటుంది కానీ థియేటర్ లో ఉండే ప్రతి వాడిలో భక్తి ఉంటుందా ? ఎందుకు శర్వానంద్ ఇలా మాట్లాడుతున్నాడు అంటూ శర్వా చేసిన పనికి సోషల్ మీడియాలో ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు.