బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ అందం గురించి, ఆమె గ్లామర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హీరోయిన్ గా క్రేజీ గా మారిన అలియా భట్ నటన పరంగా ఎన్నో అవార్డులు , రివార్డులు అందుకుంది. పెళ్లి తర్వాత అలాగే రాహా పుట్టాక కూడా అందం విషయంలో, ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం తగ్గని అలియా భట్ ఫొటోస్ సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు వైరల్ చేస్తూ ఉంటారు.
తాజాగా ముంబై లో జరిగిన ఓ ఈవెంట్ కి అలియా భట్ వైట్ కలర్ డిజైనర్ శారీ లో కనిపించి కనువిందు చేసింది. ప్లెయిన్ వైట్ శారీ లో డిజైనర్ బ్లౌస్ లో శారీ కి మల్లెమొగ్గల్లాంటి లేస్ తో అలియా భట్ అజంతా శిల్పం లా పోతపోసినట్టుగా కనిపించింది. బ్యూటీ అనే పదం కూడా తక్కువే అన్నట్టుగా అలియా భట్ లేటెస్ట్ లుక్ ఉంది.
ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న అలియా భట్ సౌత్ సినిమాల కోసం ఇక్కడి ప్రేక్షకులు వెయిటింగ్. కాని అలియా భట్ ఎందుకో సౌత్ మూవీస్ ని అంతగా పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు.