టాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలిలో ఉన్నంత మంది హీరోలు మరే ఫ్యామిలీలోను లేరు. అందుకే దర్శకులు మెగా హీరోలతో చాలా జాగ్రత్తగా ఉంటారు. చిరు తో హిట్ కొడితే చరణ్ తో అవకాశం... పవన్ తో హిట్ కొడితే మిగతా హీరోలను లైన్ లో పెట్టొచ్చు అలా దర్శకులు మెగా కాంపౌండ్ లో కాలు పెట్టేందుకు జాగ్రత్తలు తీసుకుంటారు.
తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి సరదాగా మెగా ఫ్యామిలీ అక్కడ అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గానే అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరు తో మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టారు. తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల రాకాస తో మంచి హిట్ కొట్టారు.
రాకాస సక్సెస్ ఈవెంట్ కోసం గెస్ట్ గా అనిల్ రావిపూడి ని తీసుకొచ్చారు. అయితే నిహారిక అనిల్ రావిపూడికి ఫోన్ చేసినప్పుడు ఆయన ముంబై లో వెళుతున్నారట. అదే విషయం అనిల్ రావిపూడి చెబుతూ.. నిహారిక ఫోన్ చేసింది.. ఎక్కడ ఉన్నారు అని, ముంబై వెళ్తున్నాను అమ్మ అన్నాను
మన ఈవెంట్ కి వస్తున్నారు కదా అంది . వస్తున్నారు కదా అన్నాక, ఇంకా ఏం చేస్తాం.. అసలే మెగా ఫ్యామిలీ అంటూ అనిల్ రావిపూడి భయం నటిస్తూ సరదాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.