నిజంగానే విశ్వంభర ను కష్టాలు వెంటాడుతున్నాయి. విశ్వంభర రిలీజ్ తేదీ పై మేకర్స్ ఎందుకంత ఆలోచన చేస్తున్నారు. అసలు విశ్వంభర సీజీ వర్క్ ఎక్కడివరకు వచ్చింది. ఎందుకు మేకర్స్ విశ్వంభర విడుదల తేదీపై కాన్ఫిడెన్స్ చూపించడం లేదు. దర్శకుడు వశిష్ట ఏం చేస్తున్నారు. విఎఫెక్స్ వర్క్ ఫినిష్ అవుతుంది, ట్రైలర్ రెడీ అంటూ వార్తలు వినిపించాయి.
కానీ విశ్వంభర మేకర్స్ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. అందుకే మెగా అభిమానులకు విశ్వంభర విడుదల తేదీ విషయంలో మంటెత్తిపోతుంది. మేకర్స్ ని మెగా ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. పెద్ద పెద్ద పండగలు వచ్చాయి, వెళ్లాయి, కానీ విశ్వంభర జాడ లేదు.
జూన్, జులై రిలీజ్ అన్నా ఇప్పుడే విడుదల తేదీ ఇవ్వాలి, విశ్వంభర ట్రైలర్ ఆహా ఓహో అనేలా కట్ చేస్తున్నారు, విశ్వంభర ట్రైలర్ తోనే సినిమాపై ఊపొస్తుంది.. అంటున్నారు. అసలు విశ్వంభర పై ఎవరిలో ఆసక్తి కనిపించడమే లేదు. అదే మెగా ఫ్యాన్స్ బాధ. ప్రేక్షకులు ఎక్కడ విశ్వంభర ను మర్చిపోతారో అని.