ప్రస్తుతం హైదరాబాద్ లోని శంకర్ పల్లిలో వారణాసి షూటింగ్ చేస్తున్నారు రాజమౌళి. రుద్రా పాత్రధారి మహేష్, కుంభ పాత్రధారి పృథ్వీరాజ్ సుకుమారన్ , మందాకినీ ప్రియాంక చోప్రాలపై రాజమౌళి కీలక సన్నివేశాల షూట్ చేస్తున్నారు. భారీగా వేసిన కాశీ సెట్ లో వారణాసి షూటింగ్ జరుగుతుంది.
మరో రెండు వారాల పాటు ఈ షెడ్యుల్ ఉంటుంది అని.. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే మహేష్ ఎప్పటిలాగే తన కుటుంబంతో సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిపోతారట. మహేష్ బాబు ఏడాదిలో మూడుసార్లు విదేశీ ట్రిప్స్ వేస్తారు. రాజమౌళి వారణాసి పట్టాలెక్కాక మహేష్ కి నో విదేశీ ట్రిప్స్ అంటూ ప్రచారం జరిగింది.
కానీ రాజమౌళి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినప్పుడల్లా మహేష్ ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేస్తున్నారు. ఇప్పుడు కూడా మహేష్ తన ఫ్యామిలీతో కలిసి ఒక నెల పాటు విదేశాలకు సమ్మర్ వెకేషన్ కోసం వెళ్ళబోతున్నారట. దాదాపు మే నెల మొత్తం మహేష్ విదేశాల్లోనే గడపబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఎండలు ఎక్కువగా ఉండడంతో రాజమౌళి వారణాసి షూటింగ్ కి బ్రేకిచ్చి తన ఫ్యామిలితోను విదేశీ టూర్ ప్లాన్ చేసుకుంటున్నారట. ఇక తిరిగిరాగానే అంటార్కిటికా లో వారణాసి కి సంబందించిన ఓ భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసారని టాక్.