బాలీవుడ్ గ్లామర్ డాల్ దిశా పటానీ తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల జరిగిన ఒక ప్రముఖ ఫ్యాషన్ ఈవెంట్‌లో ఈ సన్నజాజి సోయగం ధరించిన స్టన్నింగ్ అవుట్‌ఫిట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పర్ఫెక్ట్ ఫిజిక్ .. ఆత్మవిశ్వాసంతో ర్యాంప్‌పై ఆమె నడిచిన తీరు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది.
ఎప్పుడూ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే దిశా ఈ ఈవెంట్‌లో తన అద్భుతమైన లుక్‌తో ఆకర్షించింది. దిశా ఎంచుకున్న డ్రెస్ డిజైన్- మేకప్ తన అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా కనిపిస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ వీడియోలు చూసిన అభిమానులు `నేషనల్ క్రష్` అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు