ఈరోజు ఏప్రిల్ 5 ప్రముఖ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ ఆయన పెద్ద కొడుకు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. కావ్య రెడ్డి ని ప్రేమించి,పెద్దల అంగీకారంతో నిశ్చితార్ధం చేసుకున్న శ్రీనివాస్ వివాహం ఈ నెలలోనే పెద్ద తిరుపతిలోని శ్రీవారి సన్నిధిలో చేసుకోబోతున్నారు.
ఈరోజు ఆదివారం బెల్లంకొండ శ్రీనివాస్-కావ్య రెడ్డి ల నిశ్చితార్ధం కొద్దిమంది స్నేహితులు, ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యన బెల్లంకొండ ఫ్యామిలీ చాలా గ్రాండ్ గా నిర్వహించింది. అందుకు సంబందించిన ఫొటోస్ శ్రీనివాస్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. శ్రీనివాస్, కావ్య ల జంటకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.