ఈమధ్యన భారీ బడ్జెట్ సినిమాలకు డేట్స్ లాక్ చేసి అధికారికంగా ప్రకటించాక ఆ డేట్ ని అందుకోలేక నానా తిప్పలు పడుతూ లాస్ట్ మినిట్ లో సినిమాలను పోస్ట్ పోన్ చేయడమనేది ఫ్యాషన్ అయ్యిపోయింది. ప్యాషన్ అంటారా లేదంటే మారేదన్నా అంటారో తెలియదు కానీ.. అభిమానుల మనోభాలతో ఆడుకోవడం, మిగతా సినిమాలను కన్ఫ్యూజన్ లోకి తొయ్యడమనేది పరిపాటిగా మారిపోయింది.
పెద్ద సినిమా వస్తుంది అంటే మీడియం రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు వచ్చేందుకు రెడీ అవ్వవు, కానీ చివరి నిమిషంలో ఆ సినిమా వాయిదా అని తెలిసి అందరూ ఇబ్బందులు పడతారు. ఇక ప్రభాస్ సినిమాలు అనుకున్న సమయానికి రావు అనే పేరుంది. ఇప్పుడు దసరా కు ప్రభాస్ నుంచి రావాల్సిన ఫౌజీ దసరా కు రాదనే న్యూస్ అభిమానులను డిజప్పాయింట్ చేసింది.
ఫౌజీ షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. షూటింగ్ పూర్తయినా సీజీ వర్క్ కి సమయం పడుతుంది. సో ప్రభాస్ కి కలిసొచ్చిన డిసెంబర్ ని ఫౌజీ చూజ్ చేసుకుంటుంది. దసరా కి అని చెప్పి హరిబరి గా పరుగులు పెట్టడమెందుకు కూల్ గా డిసెంబర్లో వస్తే ఇయర్ ఎండ్ కలిసొస్తుంది అని మేకర్స్ భావిస్తున్నారట.
సో ఈ లెక్కన ఫౌజీ దసరా నుంచి తప్పుకుంటున్నట్టే. అంటే డిసెంబర్ కు వచ్చే సినిమాలు ఫౌజీ నుంచి తట్టుకోవడానికి సిద్దపడతాయో, సర్దుకుంటాయో చూడాలి.