Advertisement
Google Ads BL

బైకర్-రాకాస ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే..


నిన్న శుక్రవారం విడుదలైన చిత్రాలలో రెండు మాత్రమే ప్రేక్షకులకు క్రేజీగా దగ్గరయ్యాయి. అందులో శర్వానంద్ బైకర్, అలాగే మెగా డాటర్ నిహారిక రాకాస చిత్రాలు. ఒకటి యువి ప్రొడక్షన్, రెండు పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్. బైకర్, రాకాస చిత్రాలు రెండిటికి ఎక్స్ట్రార్డినరీ టాక్ అయితే రాలేదు. అలాగని నెగెటివ్ టాక్ కూడా పడలేదు.

Advertisement
CJ Advs

బైకర్, రాకాస రెండు చిత్రాలకు ఎబోవ్ యావరేజ్ రెస్పాన్స్ చూపించారు ప్రేక్షకులు. అయితే శర్వానంద్ బైకర్, నిహారిక రాకాస చిత్రాలు రెండూ వేర్వేరు ఓటీటీ ల నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అందులో బైకర్ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది.

ఇక నిహారిక నిర్మాతగా సంగీత్ శోభన్ నటించిన రాకాస చిత్రానికి రెండు ఓటీటీ పార్ట్నర్స్. అందులో ఒకటి నెట్ ఫ్లిక్స్, రెండోది జీ 5. అంటే రాకాస రెండు ఓటీటీ ల నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈ రెండు చిత్రాలు నాలుగు నుంచి ఐదు వారాల్లో ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా టాక్. 

 

Biker vs Rakasa:

Biker and Rakasa OTT Partners revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs