Advertisement
Google Ads BL

వివాదంలో TVK విజయ్


కోలీవుడ్ స్టార్ హీరో పార్టీ పెట్టినప్పటినుంచి తరచూ ఏదో వివాదంలో కనిపిస్తున్నారు. కరూర్ తొక్కిసలాట, ఆతర్వాత జన నాయగన్ విడుదల ఆలస్యం, పెరంబూరు ర్యాలీలో పబ్లిక్ న్యూసెన్స్ కేసు ఇలా ఏదో ఒక విషయంలో విజయ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జన నాయగన్ ఆలస్యానికి, కరూర్ తొక్కిసలాట కేసులో తనకు న్యాయం కావాలని అడుగుతున్న విజయ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఆయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా రెండు నామినేషన్స్ లో రెండు వేర్వేరు అఫిడవిట్లు ఇవ్వడం వివాదస్పదం అయ్యింది. పెరంబూరు లో ఎలాంటి పోలీస్ కేసు లేదు అని డిక్లరేషన్ ఇచ్చిన విజయ్.. తిరుచ్చి ఈస్ట్ లో మాత్రం పోలీస్ కేసు ఉంది అని అఫిడవిట్ లో పేర్కొన్నారు.

అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలకు అవకాశం ఉంటుంది అని రాజకీయవర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. 2025 మధురై లో నమోదైన కేసు వివరాలు బయటికి రావడం పై అనుమాలు మొదలయ్యాయి. అంతేకాదు విజయ్ ఈ ఎన్నికలకు డిస్ క్వాలిఫై అంటూ అప్పుడే ప్రతిపక్షాలు ప్రచారం షురూ చేసేసాయి. మరి ఈ వివాదాన్ని విజయ్ ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.

TVK Vijay in controversy:

Vijay Faces Legal Scrutiny - Perambalur vs Trichy East Affidavit Difference
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs