హిందీలో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణ చిత్రానికి సంబందించిన రామ గ్లింప్స్ ని నిన్న ఏప్రిల్ 2 హనుమాన్ జయంతి రోజున ముంబై లో రిలీజ్ చేసారు. దీని కోసం ప్రతి భాష నుంచి కొంతమంది జర్నలిస్ట్ లను స్పెషల్ గా ముంబై తీసుకెళ్లి రామాయణ రామ గ్లింప్స్ చూపించడంతో ఆ జర్బలిస్ట్ లు రామాయణ గ్లింప్స్ ఆహా ఓహో అంటూ ట్వీట్లు వేశారు.
కానీ పబ్లిక్ నుంచి మాత్రం రామాయణ టీజర్ పై విమర్శలొచ్చాయి. గ్రాఫిక్స్ విషయంలోనూ, బడ్జెట్ విషయంలోనూ రామాయణ టీజర్ పై నెగిటివిటీ కనిపించడమే కాదు.. రణబీర్ కపూర్ రాముడిగా మ్యాచ్ కాలేదంటూ ఓ వర్గం ఆడియన్స్ రామాయణ టీజర్ ని విమర్శించారు. ఇక ముంబై వెళ్ళని జర్నలిస్ట్ లు ప్రత్యేకంగా రామాయణ టీజర్ పై నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టారు.
ఈమధ్య కాలంలో ఏ టీజర్ కి ఇంత నెగిటివిటీ రాలేదు, రామాయణ టీజర్ పై ఇంత నెగిటివిటీ ఎందుకొచ్చిందో అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నారు. ఇదంతా చూసి నిజంగానే విపరీతమైన హైప్ ని రామాయణ టీజర్ మ్యాచ్ చేయలేకపోయిందా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో మొదలైంది.