హీరో శ్రీ విష్ణు ఈ ఏడాది వారం గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులను పలకరించాడు. ఫిబ్రవరిలో విష్ణు విన్యాసం విడుదల చేసిన శ్రీ విష్ణు, మార్చ్ 7 న మృత్యుంజయ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెండు సినిమాలు డిజప్పాయింట్ చెయ్యకపోయినా జస్ట్ మిక్స్డ్ రెస్పాన్స్ తో సరిపెట్టుకున్నాయి.
మృత్యుంజయ్ తో జోనర్ మార్చిన శ్రీవిష్ణు కి ఆ చిత్రం ఫుల్ శాటిస్ఫేక్షన్ ఇవ్వలేకపోయింది. థియేటర్స్ లో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్న మృత్యుంజయ్ చిత్రం ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఈ చిత్ర డిజిటల్ హక్కనులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది.
ఇప్పుడు మృత్యుంజయ్ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ ఏప్రిల్ 3 నుంచి అంటే థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల్లోపే ఓటీటీ లో స్ట్రీమింగ్ లోకి తెచ్చేసింది. థియేటర్స్ లో మిస్ అయినవారు ఈరోజు నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చిన మృత్యుంజయ్ చిత్రాన్ని వీక్షించేయ్యండి.