Advertisement
Google Ads BL

రాకాస ప్రీమియర్స్ టాక్


మెగా డాటర్ నిహారిక ప్రొడక్షన్ నుంచి సినిమా అంటే అందరిలో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంది. కమిటీ కుర్రాళ్ళు తో అవార్డులు అందుకున్న నిహారిక ఈసారి కామెడీ హీరో సంగీత్ శోభన్ - లేడీ డైరెక్టర్ తో కలిసి రాకాస చిత్రాన్ని నిర్మించింది. గత నెల రోజులుగా నిహారిక తన హీరో, హీరోయిన్ తో కలిసి రాకాస ని ప్రమోట్ చేసిన తీరుకి, రామ్ చరణ్ ప్రత్యేకంగా రాకాస టీమ్ ని ఇంటర్వ్యూ చెయ్యడం ఇలా అన్నిటికి ప్రేక్షకుల్లో రాకాసి పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఏప్రిల్ 3న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న రాకాస చిత్ర ప్రీమియర్స్ ని ఒకేరోజు ముందే వేశారు మేకర్స్. 

Advertisement
CJ Advs

రాకాస ప్రీమియర్స్ టాక్ లోకి వెళితే.. రాకాస రాక్షసుడి బ్యాక్ స్టోరీ సింప్లి సూపర్బ్. సంగీత్ శోభన్ పంచ్ డైలాగ్స్, గెటప్ శ్రీను తో కలిసి చేసిన కామెడీ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ వే లో సాగినా ట్విస్ట్ లు కామెడీ వర్కౌట్ అవ్వదు, సెకండ్ హాఫ్ ట్విస్ట్ లు  మెప్పించాయి అంటూ సోషల్ మీడియాలో ప్రేక్షకులు ట్వీట్లు వేస్తున్నారు.

మరికొంతమంది మ్యూజిక్ పెద్దగా ప్లస్ అవ్వలేదు, హార్రర్ సినిమాలకు ఇచ్చే మ్యూజిక్ కాదు ఇది, సంగీత శోభన్ ప్రతి సీన్ లో కామెడీ చేయడానికి ట్రై చేశాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు, ఫస్ట్ హాఫ్ లో కథనం పొంతన లేకుండా ఉంటుంది. అసలు కథలోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ఆసక్తికరంగా సాగిన ద్వితీయార్థం, ఫర్వాలేదనిపించిన ప్రథమార్థం ఒకసారి రాకాస ను చూసేందుకు ప్రధాన కారణం అంటూ సోషల్ మీడియాలో రాకాస పై మిక్స్డ్ రెస్పాన్స్ చూపిస్తున్నారు ఆడియన్స్. 

Rakasa Premiers Talk:

Rakasa Social Media Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs