Advertisement
Google Ads BL

ప్రేమలో ఆరుసార్లు మోసపోయిన హీరోయిన్


కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కెరీర్ లో పీక్స్ లో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్, డేటింగ్ అంటూ చాలాసార్లు కెరీర్ ని సర్వనాశనం చేసుకుంది. శాంతను తో ప్రేమలో ఉండి కెరీర్ ని పక్కన పెట్టిన శృతి హాసన్ ఆ బంధం నుంచి బయటపడి కొన్నాళ్ళు డిప్రెషన్ లో ఉంది. ఇక తన సినిమా విషయాలే కాదు, వ్యక్తిగత విషయాలను కూడా శృతి హాసన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

Advertisement
CJ Advs

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ తను ప్రేమలో ఎన్నిసార్లు మోసపోయానో చెప్పి ఎమోషనల్ అయ్యింది. తన లైఫ్ లో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని, ఆ ఆరుగురూ తమ బంధంలో ఒక్కో విధంగా తనను హార్ట్ చేశారని, తన హృదయాన్ని గాయపరిచారని శృతి హాసన్ ఎమోషనల్ అయ్యింది.

ప్రతి రిలేషన్‌షిప్‌లో నేను పూర్తిగా నమ్మకం పెట్టాను. కానీ ఒక్కోసారి ఒక్కో విధంగా ఆ నమ్మకం నన్ను బాధపెట్టింది. ఎవరినైనా ఒకరిని మనస్పూర్తిగా నమ్మి ముందుకు వెళ్లినప్పుడు, ఆ వ్యక్తి మనల్ని అర్ధం చేసుకోకుండా గౌరవించకపోతే అది చాలా పెద్ద గాయం అవుతుంది. అందుకే నేను ఇప్పటి నుంచి సింగిల్‌గా ఉండి నా లైఫ్ ని సంతోషంగా గడపాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అదే నాకు శాంతి, అదే నాకు ఆనందం అంటూ శృతి హాసన్ చెప్పుకొచ్చింది. 

Shruti Haasan:

Actress Shruti Haasan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs