Advertisement
Google Ads BL

శర్వానంద్ బైకర్ ప్రీమియర్స్ టాక్


యంగ్ హీరో శర్వానంద్ నారి నారి నడుమ మురారితో గాడి లో పడ్డాడు. అంతకుముందు సక్సెస్ కోసం యుద్ధం చేసాడు. సంక్రాంతికి సింపుల్ గా వచ్చి హిట్ అనిపించుకున్న శర్వానంద్ మళ్ళీ మూడు నెలలు తిరిగేసరికి బైకర్ తో ప్రేక్షకులను పలకరించాడు. సీనియర్ హీరో రాజశేఖర్ శర్వా కి ఫాదర్ గా యాక్ట్ చెయ్యడం, ప్రమోషనల్ కంటెంట్ అన్ని బైకర్ పై హైప్ క్రియేట్ చేసాయి. ఈరోజు ఏప్రిల్ 3 న విడుదల్లైన బైకర్ మూవీకి ఒకరోజు ముందే ప్రీమియర్స్ తో హడావిడి చేసారు మేకర్స్. 

Advertisement
CJ Advs

బైకర్ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో బైకర్ ఇలా ఉంది అలా ఉంది అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. బైకర్ టాక్ లోకి వెళితే.. ఇది యూత్ కి కనెక్ట్ అయ్యి ఆకట్టుకునే సినిమా అంటున్నారు. శర్వా-రాజశేఖర్.. తండ్రి కొడుకులుగా అద్దరగొట్టేసారు, వారి మధ్య వచ్చే సీన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. శర్వానంద్ నటనకు ఫుల్ మార్కులు పడుతున్నాయి. రేసింగ్ బ్యాక్ డ్రాప్ అందరికి నచ్చేస్తుంది. అంతేకాదు క్లైమాక్స్ అయితే మాటల్లో చెప్పలేం.. అంత బాగుంది. ఇది శర్వానంద్ వన్ మ్యాన్ షో అంటూ కొంతమంది ట్విట్టర్ లో కామెంట్స్ పెడుతున్నారు.

బైకర్ ఫస్ట్ హాఫ్ ప్లెజెంట్ గా ఉంది, కొన్ని డైలాగ్స్ మెప్పించినా.. సినిమాలో ఎమోషన్స్ మిస్ అయ్యాయి, కథ, కథనం లోపించడం బైకర్ కి మైనస్.. లేదంటే శర్వానంద్ కెరీర్ లో బైకర్ బ్లాక్ బస్టర్ అయ్యేది అంటూ మరికొందరు బైకర్ ని వీక్షించిన ఆడియన్స్ చెబుతున్న మాట. 

Biker Premiers talk:

Sharwanand Biker Premiers talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs