ఈ శుక్రవారం రెండు సినిమాలు క్రేజీగా పోటీపడుతున్నాయి. అందులో శర్వానంద్ బైకర్ ఒకటి, రెండోది నిహారిక రాకాస. మిగతా సినిమాలు ఉన్నా ఈ రెండు సినిమాల నడుమ క్రేజీ ఫైట్ నడుస్తుంది. అటు ప్రమోషన్స్ లోను రెండు నువ్వా-నేనా అని పోటీపడుతున్నాయి. నిహారిక సంగీత్ శోభన్ లు రాకాస చిత్రాన్ని పిచ్చగా ప్రమోట్ చేస్తున్నారు. శర్వానంద్, మాళవికలు బైకర్ ని పాన్ ఇండియా మార్కెట్ లో ప్రమోట్ చేస్తున్నారు.
రేపు శుక్రవారం విడుదలయ్యేది ఈ రెండు సినిమాలు అయితే ప్రభాస్ vs రామ్ చరణ్ ఎందుకు అనుకుంటున్నారా. నిహారిక, సంగీత్ శోభన్ రాకాస కు అండగా రామ్ చరణ్ ఉన్నారు. అంటే తాజాగా రాకాస టీం తో ఆయన ఇంటర్వ్యూ చేసి సినిమాని ప్రమోట్ చేసారు. మరి రాకాస కు సపోర్ట్ గా చరణ్ నిలబడ్డారు. ఇక బైకర్ హీరో శర్వానంద్ - రామ్ చరణ్ మంచి ఫ్రెండ్.
అయితే శర్వానంద్ బైకర్ కి సపోర్ట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలబడ్డారు. శర్వా మన ఇంటి కుర్రాడు, నిర్మాత వంశీ ప్రమోద్ మన ఫ్రెండ్ అంటూ బైకర్ ని ప్రమోట్ చేసారు. ఇక్కడ ప్రభాస్ కి రాకాస హీరో సంగీత్ శోభన్ కూడా బాగా కావాల్సిన వాడు కావడం ఇంట్రెస్టింగ్ విషయం.
సో ఈ వారం బాక్సాఫీసు దగ్గర ప్రభాస్ vs రామ్ చరణ్.. ఈ బైకర్, రాకాస లలో గెలుపెవరిదో తెలియదు కానీ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు మాత్రం క్రేజీ ఫైట్ చేసుకుంటున్నారు.