తమిళ సినిమా `డ్రాగన్` తో కయాదు లోహర్ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ విజయంతో తెలుగులో అవకాశాలు మొదలయ్యాయి. ఇటీవలే రిలీజ్ అయిన `ఫంకీ`లోనూ నటించింది. అలాగే నాని హీరోగా నటిస్తోన్న `ది ప్యారడైజ్` లోనూ ఛాన్స్ అందుకుంది. మరో రెండు..మూడు సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.
అయితే అమ్మడు తాజాగా ఓ మలయాళ సినిమా ప్రమోషన్ లో భాగంగా తాను నటించిన తెలుగు సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను నటించిన తెలుగు సినిమా సరిగ్గా ఆడలేదంటే? ఆ వైఫల్యం గురించి బాధపడేంత తీరిక తనకు లేదని అంది. చేతినిండా పని ఉన్నప్పుడు పాత సినిమాల రిజల్ట్ గురించి ఆలోచించడం సమయం వృధా అని అభిప్రాయపడింది.
వాటి గురించి ఆలోచిస్తే సమయం వృద్దా తప్ప చేసేదేమి లేదంది. దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. సాధారణంగా నటీమణులు తమ సినిమాలు ఫ్లాప్ అయితే నిరాశ చెందుతారు. కానీ కయాదు మాత్రం తన బిజీ షెడ్యూల్‌ను సాకుగా చూపుతూ టాలీవుడ్ వైఫల్యాలను చాలా తేలికగా తీసుకోవడం ఆశ్చర్యపరిచింది. కయాదు కెరీర్ పట్ల చాలా ప్రాక్టికల్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఒకచోట అవకాశం తగ్గినా మరోచోట రాణిస్తున్నప్పుడు పాత వాటిని తలుచుకోకూడదనేది ఆమె సిద్దాంతగా కనిపిస్తుందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో భవిష్యత్ లో అవకాశాలు రావడం కూడా కష్‌టమవుతుందని మరో నెటి జనుడు పోస్ట్ పెట్టాడు. మరి ఈ వ్యాఖ్యలపై ప్రభావం ఉంటుందా? ఉండదా? అన్నది చూడాలి.