Advertisement
Google Ads BL

ఆ దర్శకుడు రోదన పట్టించుకునేదెవరు


 థియేటర్స్ వ్యవస్థ సమూలంగా నాశనమవడానికి ఓటీటీలే కారణం. దానిలో ఎలాంటి అనుమానము లేదు. ఓటీటీలు అంతగా చెలరేగిపోవడానికి కారణం నిర్మాతలు. థియేట్రికల్ బిజినెస్ కన్నా ఓటీటీ బిజినెస్ పై మోజు పెంచుకుని థియేటర్స్ వ్యవస్థను చేతులారా నాశనం చేసుకున్నది నిర్మాతలే. వారి అత్యాశే మూల కారణం. 

Advertisement
CJ Advs

ఇప్పుడు థియేటర్స్ లో కలెక్షన్స్ రావడం లేదు అని ప్రేక్షకులను నిందిస్తే ఉపయోగం ఏముంది. ఎనిమిదివారాల గ్యాప్ తో థియేటర్స్ లో వచ్చిన సినిమాలు ఓటీటీ లోకి రావాలనే నిబంధనలు తుంగలో తొక్కి.. కేవలం నాలుగు కాదు కాదు మూడు వారాల గ్యాప్ లోనే థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమైతే ప్రేక్షకులు థియేటర్స్ కి ఎందుకు వెళతారు.

తాజాగా దర్శకుడు గుణశేఖర్ థియేటర్ల మనుగడ కోసం సినిమా విడుదలైన కనీసం 3 నెలల (12 వారాలు) తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలనే డిమాండ్‌ చేసారు. థియేటర్ లో విడుదలైన సినిమాలు తొందరగా ఓటీటీలోకి రావడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నిజమే గుణశేఖర్ చెప్పింది నూటికి నూటయాభై శాతం కరెస్ట్. కానీ ఎవరు పట్టించుకుంటారు ఈ దర్శకుడి రోదన. ఎవరి బిజినెస్ వారిది, ఎవరి ఆశ వారిది. అందుకే థియేటర్ వ్యవస్థ ఇలా తగలబడింది.

Gunasekhar Calls for 3-Month OTT Window to Save Theaters:

Gunasekhar Calls for 3 Month OTT Window to Save Theaters
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs