Advertisement
Google Ads BL

మెగాస్టార్ ఇంట్లో మహాద్భుతం


మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మహాద్భుతం జరిగింది. హనుమజ్జయంతి రోజున తమ ఇంటి ఇలవేల్పు హనుమంతుడిపై సూర్యకిరణాలు స్పృశిస్తున్న వీడియో ను మెగాస్టార్ షేర్ చేస్తూ.. 

Advertisement
CJ Advs

అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.💐 

మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.

జై శ్రీరామ్🙏 జై హనుమాన్🙏

శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా మా పూజ మందిరంలో ఉన్న విశేషాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్తవర్ణాలుగా మారి మా పూజ మందిరంలో ఉన్న హనుమంతుడిని పై నుంచి కిందివరకు స్పృశిస్తుంటే ఆ దృశ్యం, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము.

ఇటీవల మనం అయోధ్యలో బలరాముడు నుదిటిపై సూర్యకాంతి ప్రసరించిన అద్భుతాన్ని చూసాము, అలాగే కోణార్క్, అరసవెల్లి దేవాలయాల్లో కూడా సూర్య కిరణాలు భగవంతుడిని తాకే విశేషం అందరికి తెలిసిందే. అలాంటి దైవానుభూతి మా ఇంట్లోనూ ఆంజనేయుడిని స్పృశించడం అది మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాము. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు అంటూ సూర్యకిరణాలు హనుమంతుడి విగ్రహాన్ని తాకుతున్న వీడియో మెగాస్టార్ షేర్ చేసారు.

Hanuman Jayanti - Megastar shared a divine glimpse from his Pooja mandir:

Hanuman Jayanti - Megastar Chiranjeevi shared a divine glimpse from his Pooja mandir
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs