Advertisement
Google Ads BL

హిస్ట‌రీ పరీక్షలో ఓరీ కలకలం


విద్యావ్యవస్థలో డిజిటల్ సంస్కృతిని ప్రవేశపెట్టే క్రమంలో సీబీఎస్‌ఈ బోర్డుకు ఊహించని అనుభవం ఎదురైంది. మార్చి 31న జరిగిన 12వ తరగతి చరిత్ర బోర్డు పరీక్షలో ప్రశ్నపత్రంపై ఉన్న ఒక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ కోడ్ సబ్జెక్టుకు సంబంధించిన వెబ్‌సైట్‌కు కాకుండా.. ఇంటర్నెట్ సెన్సేషన్ `ఓరీ`కి సంబంధించిన గూగుల్ సెర్చ్ పేజీకి మళ్లించింది. 

Advertisement
CJ Advs

పరీక్ష రాస్తున్న సమయంలో ఇలాంటి అసంబద్ధమైన లింక్ రావడం విద్యార్థులను దిగ్భ్రాంతికి గురిచేయగా.. ఈ వార్త సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపించింది. ఈ ఘటనపై ఓరీ స్వయంగా స్పందిస్తూ.. తాను ఇప్పుడు కీర్తి శిఖరానికి చేరుకున్నానని సరదాగా వ్యాఖ్యానించడం విశేషం. 

బోర్డు పరీక్షా పత్రంలో తన పేరు ప్రస్తావనకు రావడంపై ఆయన చేసిన ఫన్నీ కామెంట్స్ నెట్టింట మీమ్స్ వెల్లువకు దారితీశాయి. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన నేటి యువ‌త  చిలిపి పనా లేక సాంకేతిక లోపమా అనే చర్చ జరుగుతుండగా.. సీబీఎస్‌ఈ బోర్డు ఆ ప్ర‌శ్నా పత్రాలు ప్రామాణికమైనవేనని ధృవీకరించింది. అయితే విద్యా సంబంధిత కీలక పత్రాల విషయంలో ఇలాంటి పొరపాట్లు జరగడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

History made, Orry barcode on CBSE board history exam:

Orry barcode on CBSE board history exam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs