పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకేసారి మూడు సినిమాలను సెట్ పై ఉంచి అటు దర్శకులు, ఇటు నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారా.. ఒక సినిమా అయ్యాక మరో సినిమాకి డేట్స్ ఇవ్వకుండా మూడు సినిమాలను సెట్స్ పై పెట్టి అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారా.. అంటే అదే అంటున్నారు నెటిజెన్లు. వరసగా మూడు సినిమాలు.. స్పిరిట్, ఫౌజీ, ఇప్పుడు కల్కి 2.
వీటిలో ముందుగా ఫౌజీ పూర్తవ్వాలి. కారణం దసరా రిలీజ్ అంటూ మేకర్స్ అనౌన్స్ చేసేసారు. హను రాఘవపూడి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రానికి ప్రభాస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారట. అందుకే స్పిరిట్ షూటింగ్ ఆలస్యమవుతుంది అని, సందీప్ వంగా ప్రభాస్ లేని సీన్స్ చక్కబెట్టేస్తున్నా.. ప్రభాస్ స్పిరిట్ కొత్త షెడ్యూల్ లో జాయిన్ అయ్యేందుకు ఎక్కువ సమయమే పడుతుందట.
గత ఏడాది డిసెంబర్లో మొదలైన స్పిరిట్ కి సంబందించిన ఓ షెడ్యూల్ లో మాత్రమే ప్రభాస్ పాల్గొన్నారు. కానీ కొత్త షెడ్యూల్ లో ప్రభాస్ జాయిన్ అవ్వలేదు. మరోపక్క ప్రభాస్ కల్కి 2 కోసం డేట్స్ ఇచ్చేసారు. అటు ఫౌజీ, ఇటు కల్కి 2 తో ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ ఆలస్యమవుతుంది అని తెలుస్తుంది.
మరి ఇదంతా చూస్తుంటే వచ్చే ఏడాది మార్చి లో స్పిరిట్ వస్తుందా, రాదా అనే అనుమానం ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ లో మొదలైంది. చూద్దాం సందీప్ రెడ్డి వంగ ఏం మ్యాజిక్ చేస్తారో అనేది.