బాలీవుడ్ లో నితీష్ తివారి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణ చిత్రం ఈ ఏడాది దీపావళికి మొదటి భాగం విడుదల అని మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక రీసెంట్ గా వచ్చిన ఈ శ్రీరామ నవమికి రామాయణ నుంచి ఏదో ఒక అప్ డేట్ ఉంటుంది అని ఆశించిన అభిమానులకు శ్రీరామ నవమికి కాదు ఏప్రిల్ 2 హనుమాన్ జయంతి రోజున రామాయణ గ్లింప్స్ ఇస్తామని మేకర్స్ ప్రామిస్ చేసారు.
రామాయణ లో రాముడి గా రణబీర్ కపూర్, సీత గా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, రావణ్ గా యష్ నటిస్తున్న ఈ చిత్రం పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అయితే తాజాగా రణబీర్ కపూర్ ఈ చిత్రం గురించి మట్లాడుతూ.. శ్రీరాముడు పాత్ర కేవలం ఒక పురాణ పాత్ర మాత్రమే కాదు. ఎన్నో ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజల ఆరాధ్య దైవం. కష్ట సమయాల్లో ఆయన మనతో ఉంటారు అనేది ఎన్నో సందర్భాల్లో చూసాం.
జాలి, ధైర్యం, నీతి, క్షమాగుణానికి శ్రీరాముడు నిలువుటద్దం. అలాంటి శ్రీరాముడి పాత్ర నేను పోషించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా అంటూ రణబీర్ కపూర్ రామాయణ గురించి చెప్పుకొచ్చారు. ఇక ఏప్రిల్2 న రాబోతున్న రామాయణ గ్లింప్స్ 2 నిమిషాల 38 సెకన్లు ఉండనుంది.