Advertisement
Google Ads BL

పాన్-వరల్డ్ రేసులో బాలీవుడ్ భామలదే హవా


ప్రస్తుతం  భారతీయ చిత్ర పరిశ్రమ  పాన్-వరల్డ్ లక్ష్యంగా దూసుకుపోతుండటంతో దక్షిణాది దర్శకులు  భారీ బడ్జెట్ చిత్రాల కోసం బాలీవుడ్ భామలకే పెద్ద పీట వేస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్‌ను ఆకట్టుకోవడానికి అంతర్జా తీయ గుర్తింపు ఉన్న నటీమణులను ఎంపిక చేస్తూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న `వారణాసి` చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను ఎంపిక చేయడం ఈ వ్యూహంలో భాగమే. హాలీవుడ్‌లోనూ ముద్ర వేసిన ప్రియాంక తోడవ్వడం వల్ల ఈ అడ్వెంచర్ మూవీకి అంతర్జాతీయ స్థాయిలో భారీ బిజినెస్ జరిగే అవకాశం ఉంది.

Advertisement
CJ Advs

మాస్ సినిమాల స్పెషలిస్ట్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ న‌టిస్తోన్న  `స్పిరిట్` మూవీలో నేషనల్ క్రష్ తృప్తి డిమ్రీని తో పాటు ఐశ్వర్య దేశ్‌ను ఎంపిక చేయడం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్రిప్తీ పాన్ ఇండియా క్రేజ్ సినిమాకు ప్ల‌స్ గా మారింది. బ‌న్నీ-అట్లీ సినిమాలో దీపికా ప‌దుకొణే ఎంట్రీ అంతే ఆస‌క్తిక‌రం. అలాగే  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ న‌టిస్తోన్న `పెద్ది` , ఎన్టీఆర్ నటించినున్న `దేవర2` చిత్రాల్లో జాన్వీ కపూర్ కథానాయికగా ఎంపికైంది. శ్రీదేవి తనయగా ఉన్న క్రేజ్‌తో మ‌రిన్ని సౌత్ అవకాశాలు అందు కోనుంది. ఈ సౌత్ హీరో - నార్త్ హీరోయిన్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద అసలైన సక్సెస్ మంత్రంగా మారనుంది.

దక్షిణాది దర్శకులు బాలీవుడ్ నటీమణుల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం మార్కెట్ విస్తరణే. మన హీరోల యాక్షన్ ఇమేజ్‌కు బాలీవుడ్ భామల గ్లామర్ తోడైతే సినిమాకు జాతీయ స్థాయిలోనే కాకుండా ఓటీటీ మరియు శాటిలైట్ హక్కుల పరంగా కూడా భారీ ధర పలుకుతోంది. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ల వల్ల హిందీ బెల్ట్‌లో సినిమాలకు విపరీతమైన క్రేజ్ రావడంతో పాటు, భారతీయ సినిమా స్థాయి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అమాంతం పెరుగుతోంది. కథానాయికల ఎంపికలో దర్శకులు చూపిస్తున్న ఈ కొత్త ట్రెండ్ పాన్-వరల్డ్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులకు బాటలు వేసే అవ‌కాశం లేక‌పోలేదు.

Bollywood Beauties Key Role In Pan Indian Films:

Bollywood Beauties in Pan-Indian Cinema
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs