Advertisement
Google Ads BL

రెండు చోట్ల పోటీ చేస్తున్న విజయ్


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తమిళనాట ఏప్రిల్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరి లో తమ TVK పార్టీ నుంచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే తన దగ్గర ఎన్నాళ్ళుగానో పని చేస్తున్న కారు డ్రైవర్ కి ఎమ్యెల్యే టికెట్ ఇచ్చిన విజయ్ ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చెయ్యబోతున్నారు. 

Advertisement
CJ Advs

అందులో ఇప్పటికే విజయ్ చెన్నైలోని పెరంబూరు నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే తమిళనాడులోని తిరుచ్చి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. అయితే విజయ్ ఎంచుకున్న రెండు స్థానాల్లో ప్రత్యర్థులు చాలా బలమైన వారే ఉండడం గమనార్హం. దీనిని బట్టే విజయ్ తనపై తనకు ఎంత నమ్మకముందో ప్రజలకు చెప్పకనే చెబుతున్నారు.

ఇదే మాదిరి గతంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారు. గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. ఇప్పుడు పవన్ లానే విజయ్ కూడా రెండు బలమైన నియోజకవర్గాల నుంచి పోటీపడుతున్నారు. చూద్దాం విజయ్ పొలిటికల్ స్టామినా ఎంత అనేది.

Vijay To Contest From 2 Seats:

Vijay to enter poll fray from Perambur, Trichy East
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs