Advertisement
Google Ads BL

పెద్ది వాయిదా తప్పదా..


పెద్ది చిత్రం ఏప్రిల్ 30 విడుదల అని నిర్మాతలు పదే పదే చెబుతున్నా సోషల్ మీడియాలో కొంతమంది వేస్తున్న ట్వీట్స్ మెగా ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఏ సినిమా విడుదల విషయంలో జరగని చర్చ పెద్ది విషయంలో జరుగుతుంది. పెద్ది షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడమే అందుకు మెయిన్ రీజన్.

Advertisement
CJ Advs

పెద్ది విడుదలకు ఇంకా 30 రోజుల సమయమే ఉంది. ఈరోజు మార్చి 30. కానీ పెద్ది విడుదల విషయంలో జరుగుతున్న చర్చ మెగా అభిమానులను టెన్షన్ లో పడేస్తుంది. మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నా సోషల్ మీడియా ట్వీట్స్ చూసి చాలామంది పెద్ది వాయిదా పడినట్లే అని మాట్లాడుకుంటున్నారు. 

స్పెషల్ సాంగ్ చిత్రీకరణ, ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ ఓ పది రోజుల్లో ఫినిష్ అయితే ప్రమోషన్స్ కు 20 డేస్ సరిపోతాయి. ప్రస్తుతం పెద్ది అప్ డేట్స్ కి వస్తున్న ఫీడ్ బ్యాక్.. పెద్దికి ప్రమోషన్స్ చెయ్యకపోయినా ఓపెనింగ్స్ అదిరిపోయేలా ఉంది. మరి ఈ లెక్కన పెద్ది పాన్ ఇండియా మార్కెట్ లో ఓ నాలుగు సిటీస్ ని ఎంచుకుని ప్రమోషన్స్ చేస్తే సరిపోతుంది.

పెద్ది మేకర్స్ ఆలోచన ఎలా ఉన్నా.. పెద్ది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది అనేది ఫిలిం సర్కిల్స్ లో నడుస్తున్న మాట.

Peddi Movie:

Peddi Movie Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs