పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మార్చ్ 19 న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ కి ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ నుంచి జస్ట్ యావరేజ్ టాక్ రావడం, ధురంధర్ 2 దెబ్బ ఉస్తాద్ ను కోలుకోలేకుండా చేసాయి. సోలో రిలీజ్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సేఫ్ అయ్యేది.
కానీ ధురంధర్ 2 మీదకి ఉస్తాద్ ని వదిలి మేకర్స్ భారీ మూల్యం చెల్లించుకున్నారు. మార్చ్ 19 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ డీల్ తో సొంతం చేసుకుంది. థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన ఉస్తాద్ ను నెట్ ఫ్లిక్స్ ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తుంది అని చాలామంది వెయిట్ చేస్తున్నారు.
అయితే నెట్ ఫ్లిక్స్ ఉస్తాద్ భగత్ సింగ్ ని ఏప్రిల్ 23 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా తెలుస్తుంది. అంటే థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల గ్యాప్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ కి వస్తుందన్నమాట.