మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే ట్రీట్ పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ ని మెగా ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్ బీస్ట్ మోడ్ లుక్ లో మెగా ఫ్యాన్స్ ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. యూట్యూబ్ లో చూస్తేనే ఇలా ఉంటే.. పెద్ది లో రామ్ చరణ్ విశ్వరూపాన్ని థియేటర్స్ లో చూస్తే పూనకాలే అంటూ మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
అయితే మరొక్క నెల అంటే ఏప్రిల్ 30 న పెద్ది చిత్రాన్ని విడుదల చెయ్యడం సాధ్యమేనా? పెద్ది షూటింగ్ పూర్తి కాలేదు, పోస్ట్ ప్రొడక్షన్ అవ్వలేదు, ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యలేదు.. మరి ఏప్రిల్ 30న పెద్ది వస్తుందా, రాదా అనే ప్రశ్నలకు మేకర్స్ నిన్న చరణ్ బర్త్ డే రోజున కూడా క్లారిటీగా విడుదల తేదీ వేశారు. అయినప్పటికీ ఎక్కడో అభిమానుల్లో డౌట్ కొడుతోంది.
కానీ ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు, పెద్ది గ్యారెంటీ గా పెద్ది ఏప్రిల్ 30 రీల్స్. ఎందుకంటే పెద్ది ఫస్ట్ హాఫ్ లాక్ చేసేసారు దర్శకుడు బుచ్చి బాబు. సెకండ్ హాఫ్ లాక్ చెయ్యాల్సి ఉంది. మరోపక్క సీజీ వర్క్, BGM, డబ్బింగ్ వర్క్ అన్ని ఫాస్ట్ గా జరుగుతున్నాయి. అలాగే ప్యాచ్ వర్క్ తో పాటుగా స్పెషల్ సాంగ్ కి ప్లాన్ చేసి చిత్రీకరణ చేపట్టేందుకు టీమ్ రెడీ అవుతుంది.
సో అభిమానులు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, మేకర్స్ అనుకున్నట్టుగానే పెద్ది చిత్రాన్ని ఏప్రిల్ 30 కి రిలీజ్ చేయడం పక్కా.