Advertisement
Google Ads BL

వీకెండ్ ని క్యాష్ చేసుకోలేకపోతున్న ఉస్తాద్


ఆత్రం ఆగక అనుకున్న డేట్ కన్నా ఓ వారం ముందే థియేటర్స్ లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కి నిర్మాతలకు పెద్దగా నష్టం ఉండేది కాదు. కానీ ధురంధర్ 2 వల్ల ఉస్తాద్ భగత్ కి నష్టాలు తప్పేలా కనిపించడం లేదు.

Advertisement
CJ Advs

మొదటి వీకెండ్ తోనే సైలెంట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్.. వీక్ డేస్ లో పూర్తిగా చేతులెత్తేసింది. సరే సెకండ్ వీక్ లో ఆడియెన్స్ ని ప్రభావితం చేసే సినిమాలేవీ లేవు ఈ వీకెండ్ లో అయినా ఉస్తాద్ భగత్ సింగ్ ని చూసేందుకు పేక్షకుల్లో ఆసక్తి మొదలవుతుంది అనుకుంటే.. ఈ వీకెండ్ ని కూడా ఉస్తాద్ క్యాష్ చేసుకోలేకపోతుంది.

శనివారం, ఆదివారం రెండు రోజుల్లో ఉస్తాద్ థియేటర్స్ లో ప్రేక్షకులు కనిపించేలా లేరు. బుక్ మై షో ఓపెన్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్స్ ఈజీగా దొరికేస్తున్నాయి. సీట్స్ అన్ని ఖాళీ. మరి కలిసొచ్చిన సెకండ్ వీక్ ని, ఆఖరికి వీకెండ్ ని ఉస్తాద్ భగత్ సింగ్ ఉపయోగించుకోలేక పోవడం బ్యాడ్ లక్ అనే చెప్పాలి. 

Ustaad Bhagat Singh:

Ustaad Bhagat Singh Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs