బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ పెళ్ళికి ముందు, తల్లవకముందు ఎప్పుడు గ్లామర్ చూపించడానికే తహతహలాడేది. ఫ్యాషన్ షో అయినా, లేదంటే బాలీవుడ్ అవార్డు ఈవెంట్స్ అయినా, ఇతర పబ్లిక్ ఈవెంట్స్ లో అయినా ఎప్పుడు మడి కట్టుకుని కూర్చోకుండా అందాలు చూపించే మోడ్రెన్ డ్రెస్సులతో గ్లామర్ షో చెయ్యడం కియారా స్పెషల్.
పెళ్ళయ్యింది, తల్లయ్యింది.. అయినా ఆమె అందంలో ఎలాంటి మార్పు లేదు, ఫిజిక్ లో ఎలాంటి తేడా లేదు, అలాగే గ్లామర్ షో చేయడంలోనూ ఎక్కడా తగ్గట్లేదు. తల్లయ్యాక మరింత ఆకర్షణగా అందాల ప్రదర్శనకు కియారా అద్వానీ ఆసక్తి చూపిస్తుందా అనేలా ఆమె లేటెస్ట్ ఫోటో షూట్స్ ఉంటున్నాయి.
తాజాగా GRAZIA మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం కియారా చేయించుకున్న ఫోటో షూట్ చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఆ మ్యాగజైన్ కవర్ పై కియారా ఫొటోస్ చూస్తే మతిపోగెట్టేశావ్ కియారా అని మీరు కూడా అంటారు.