Advertisement
Google Ads BL

ఈసారి స్నేహితులను నమ్ముకోని మారుతి


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అవకాశం ఇచ్చినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి ని సోషల్ మీడియాలో ట్రోల్ చెయ్యడంతో ఆయన ప్రభాస్ తో చేస్తున్న రాజసాబ్ మూవీ అప్ డేట్స్ ని సోషల్ మీడియాలో తన స్నేహితుడు జర్నలిస్ట్ ని పట్టుకుని తన సినిమా అప్ డేట్స్ ని ట్వీట్లు వేయిస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ని కూల్ చేసుకుంటూ వచ్చాడు.

Advertisement
CJ Advs

ప్రభాస్ రాజాసాబ్ అప్ డేట్ ని మారుతి ఏది డైరెక్ట్ గా ఇవ్వకుండా ఆ జర్నలిస్ట్ ఫ్రెండ్ తో ఇప్పించాడు. ఫ్యాన్స్ కూల్ అవ్వగానే నేరుగా సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ వచ్చాడు. అయితే మారుతిని రాజసాబ్ ప్లాప్ అయినప్పుడు ఆ జర్నలిస్ట్ ఫ్రెండ్ ఎంతగా కాపాడుదామని ట్రై చేస్తూ ట్వీట్లు వేసినా ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని మాములుగా అటాక్ చెయ్యలేదు.

అందుకేనేమో ఈసారి మారుతి తన జర్నలిస్ట్ ఫ్రెండ్ ని నమ్ముకోకుండా డైరెక్ట్ గా తనే సోషల్ మీడియాలో తన కొత్త అప్ డేట్ అదేనండి.. హ్యాపీ పొంగల్ స్క్రిప్ట్ దాదాపుగా ఫైనల్ స్టేజ్ కి వచ్చింది అంటూ శ్రీరామనవమి రోజున సెల్ఫీ తో అప్ డేట్ ఇచ్చుకున్నాడు. సో ఈసారి ఏ ఫ్రెండ్ సాయం తీసుకోకుండా డైరెక్ట్ గానే రంగంలోకి దిగారు.

మారుతి  తన నెక్స్ట్ ప్రాజెక్ట్ హ్యాపీ పొంగల్ 40-50 రోజుల్లో పూర్తి చెయ్యాలని ప్లాన్ చేసుకుని పక్కాగా రంగంలోకి దిగబోతున్నట్లుగా సోషల్ మీడియా టాక్. 

Director Maruthi Next Movie Update:

Director Maruthi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs