కల్కి 2898 AD కి సీక్వెల్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2 చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో జరుగుతుంది. ఇంకా కల్కి 2 సెట్ లోకి ప్రభాస్ జాయిన్ అవ్వకపోయినా.. విలన్ పాత్రధారి కమల్ హాసన్, అమితాబచ్చన్ లపై నాగ్ అశ్విన్ కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఇక దీపికా పదుకొనె స్థానంలో సాయి పల్లవి నటించబోతుంది అనే న్యూస్ ఉన్నా అధికారిక ప్రకటన లేదు.
అయితే కల్కి 2 మొదటి భాగంలో కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించిన కురుక్షేత్ర యుద్ధ ఘట్టాలు, కల్కి రెండో భాగంలో 20 నిమిషాలు పైనే ఉంటుందంట... అశ్వత్థామ శాపం, కర్ణుడి వీరత్వం, కృష్ణుడి వ్యూహాలు.. ఇలా ప్రతిదీ పీక్స్‌లో ఉండబోతోందని టాక్. ముఖ్యంగా పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో జోడించిన తీరు భారతీయ సినీ చరిత్రలోనే ఒక సరికొత్త ప్రయోగంగా ఉంటుందని అంటున్నారు.
మరి సైన్స్ ఫిక్షన్ పర్ఫెక్ట్ గా కుదిరి ఆడియన్స్ కి కనెక్ట్ అయితే అది ఏ రేంజ్ హిట్ అవుతుందో ఊహించడము కష్టమే. ఇక కల్కి 2 సెట్ లోకి ప్రభాస్ మే లో ఎంటర్ అవుతారని టాక్. కల్కి పార్ట్1 కన్నా కల్కి పార్ట్ 2 విషయంలో నాగ్ అశ్విన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట.