బాలీవుడ్ క్యూటీ అలియా భట్.. ఈ పేరు వింటేనే కుర్ర కారు వెర్రెత్తిపోతారు. అమ్మడు స్టార్ హీరో రణవీర్ కపూర్ ని వివాహం చేసుకుని రాహా కి తల్లయింది. అయినా ఆమె అందం అణువంతైనా తగ్గలేదు. పెళ్ళికి ముందు అలియా భట్ ఎలా అందో.. పాప పుట్టాక కూడా ఆమె అంతే నాజూగ్గా, గ్లామర్ గా కనిపిస్తుంది.
అందాలు చూపించే విషయంలో అస్సలు హద్దులు పెట్టుకోని అలియా భట్ ని మహారాణి మాదిరి ట్రీట్ చేస్తారు ఆమె ఫ్యాన్స్. ఇక సోషల్ మీడియాలో అలియా భట్ ఫోటోషూట్స్ ఎంతెలా వైరల్ అవుతాయో చూస్తుంటాము. తాజాగా పేపర్ సిల్క్ ఆర్గాన్జా హ్యాండ్ ప్రింటెడ్ గ్రీన్ ట్రాన్స్పరెంట్ శారీ లో అలియా భట్ వదిలిన ఫొటోస్ నెట్టింట్లో సంచలంగా మారాయి.
సౌత్ లో ఆర్.ఆర్.ఆర్ చిత్రం చేసిన అలియా భట్ ఆతర్వాత ఎన్టీఆర్ తో దేవర చెయ్యాల్సింది, చేజార్చుకుంది. ఇక ఎప్పుడెప్పుడు ఆమె సౌత్ గడ్డ పై అడుగుపెడుతుందా అని సౌత్ ఆడియన్స్ తెగ వెయిట్ చేస్తున్నారంటే నమ్మాలి. మరి ఆ శుభ తరుణం ఎప్పుడు వస్తుందో చూడాలి.