ఈరోజు మార్చ్ 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. చరణ్ బర్త్ డే కి ఆయన తండ్రి మెగాస్టార్ చిరు తో పాటుగా బాబాయ్ పవన్ కళ్యాణ్, ఇంకా సినీ ప్రముఖులు, మెగా అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కి చెప్పిన బర్త్ డే విషెస్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి.
హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్!
ప్రముఖ యువ కథానాయకుడు @AlwaysRamCharan కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నటన పట్ల అంకిత భావం కలిగిన రామ్ చరణ్ ప్రతి చిత్రాన్ని తపనతో చేస్తారు. కుటుంబ బంధాలకు విలువనిస్తూ పెద్దల పట్ల గౌరవం కనబరుస్తూ, సహచర నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, రచయితలతో మర్యాదగా మెలుగుతారు.
ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉంది. ఇవే రామ్ చరణ్ కు ఎల్లవేళలా శ్రీరామరక్ష. రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.. అంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.