Advertisement
Google Ads BL

సురేష్ బాబు పై బాబు మోహన్ ఫైర్


సీనియర్ నటులు మాజీ మంత్రి బాబు మోహన్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు పై వెటకారంగా కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.  రీసెంట్ గా బాబు మోహన్ ని రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన చింతామణి నాటక ప్రదర్శనకు గెస్ట్ గా ఆహ్వానించారు. అయితే ఆయనకు అక్కడ తగిన మర్యాద దక్కలేదు అనే కారణంతో స్టేజ్ పైనే సురేష్ బాబు పై ఇండైరెక్ట్ గా వెటకారపు కామెంట్స్ చెయ్యడం వైరల్ అవుతుంది.

Advertisement
CJ Advs

రామానాయుడు గారంటే నాకు గౌరవం, ఆయన వల్లే నేను స్టార్ట్ అయ్యాను, కానీ ఇక్కడ సురేష్ బాబుదే పెత్తనం. రామానాయుడు స్టూడియోలో సురేష్ బాబు గారిదే పెత్తనం. నన్ను దయచేసి ఇంకెప్పుడూ ఇక్కడికి పిలవకండి, రామానాయుడు గారి కంటే సురేష్ బాబు చాలా పెద్దవారు అంటూ బాబు మోహన్ కాస్త కోపం గానే వెటకారంగా మాట్లాడి స్టేజ్ దిగి వెళ్లిపోయారు.

ప్రస్తుతం బాబు మోహన్ సురేష్ బాబు పై చేసిన కామెంట్స్ కి సంబందించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో.. బాబు మోహన్ కి అక్కడేం అవమానం జరిగిందో అందుకే ఆయన అంతలా బాధపడ్డారంటూ ఆయన అభిమానులు మాట్లాడుకుంటున్నారు. 

Babu Mohan Shocking Comments On Suresh Babu:

Babu Mohan 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs