ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజెనోవా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. భార్యకు వెల్ కమ్ చెబుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్ వేశారు. తాజాగా అన్న లెజెనోవా సోషల్ మీడియాలో తన బావగారులు, పవన్ కళ్యాణ్ అన్నయ్యలైన మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు లతో ఉన్న పిక్స్ పోస్ట్ చేసారు.
15 ఏళ్ళ క్రితం బలమైన బంధాలతో అందరూ ఒకరికొకరు అని ఉన్న ఫ్యామిలీలోకి అడుగుపెట్టాను. ఆ ఫ్యామిలీ మెంబెర్స్ ని ఎలా పిలవాలో, ఎవరితో ఎలా మెలగాలో తెలియదు. అందుకే నా భర్త పవన్ ఎలా మట్లాడేవారో అలానే ఆయన్ని అనుసరించాను. అన్నయ్య, చిన్నన్నయ్య.
మొదట్లో అవి కేవలం మాటలే. జాగ్రత్తగా కొంత సందేహంతో. కానీ క్రమేణా అవే నా భావాలయ్యాయి. ఆ తరువాత ఇంకో విధంగా వాళ్ళను పిలవొచ్చని తెలిసినా, అప్పటికే అది భాష విషయం కాదు. నాకు అన్నయ్య లేరు. కానీ నాకు లైఫ్ నెమ్మదిగా ఇద్దరు అన్నయ్యలను ఇచ్చింది ❤️ వారే చిరంజీవి & నాగబాబు అంటూ అన్న లెజెనోవా సోషల్ మీడియాలో మొదటిగా వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.