యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈమధ్యన లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నారు. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్(వర్కింగ్ టైటిల్) మూవీ చేస్తున్న ఎన్టీఆర్ సైలెంట్ గా షూటింగ్ లో పాల్గొంటున్నారు తప్ప హడావిడి చెయ్యడం లేదు. రీసెంట్ గా జోర్డాన్ షెడ్యూల్ ముగించి హైదరాబాద్ షెడ్యూల్ మొదలు పెట్టింది టీమ్.
అయితే గత రాత్రి తన భార్య లక్ష్మి ప్రణతి బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ ఓ లావిష్ పార్టీ అరెంజ్ చేసారు. ఈరోజు మార్చ్ 26 లక్ష్మి ప్రణతి బర్త్ డే. గత రాత్రే ఎన్టీఆర్ భార్య ప్రణతి కోసం పార్టీ ప్లాన్ చేసారు. ఈ పార్టీకి ఎన్టీఆర్, ప్రణతి క్లోజ్ ఫ్రెండ్స్ తో పాటు గా రాజమౌళి కొడుకు కార్తికేయ, కోడలు పూజ అటెండ్ అయ్యారు.
ఈ పార్టీ ఓ రేంజ్ లో జరిగింది అని సోషల్ మీడియాలో కనిపిస్తున్న పిక్స్ చూస్తే తెలుస్తుంది. ఎన్టీఆర్, ప్రణతి ఇద్దరూ తమ తమ ఫ్రెండ్స్ తో పార్టీ లో భీభత్సంగా ఎంజాయ్ చేసారు.